మిరాయ్ సినిమాలో “వైబ్ ఉంది బేబీ” పాటతో పాటుగా నిధి అగర్వాల్ తో చేసిన ఓ పాటను మేకర్ పక్కన పెట్టేశారు. అయితే ఈ విషయం పైన కార్తీక్ ఘట్టమనేని క్లారిటీ ఇచ్చారు. సినిమా ఫ్లో దెబ్బతింటుందని ఈ పాటలను పెట్టలేదని పేర్కొన్నారు. నిధి అగర్వాల్ పాట షూట్ చేసింది మొదటి పార్ట్ కోసం కాదని కార్తీక్ ఘట్టమనేని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పాటలను సెకండ్ పార్ట్ కోసం తీసినట్టుగా చెప్పకనే చెప్పేశారు. అయితే వైబ్ ఉంది బేబీ పాటపై కార్తీక్ ఘట్టమనేని ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మాత్రం చెప్పలేదు.

కేవలం నిధి అగర్వాల్ తో చేసిన పాటపై మాత్రమే క్లారిటీ ఇచ్చారు. కాగా, ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలై భారీగా కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రను పోషించారు. ఈ సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలోనే కోట్లలో కలెక్షన్లను రాబడుతోంది. రితిక నాయర్ సినిమాలో హీరోయిన్ గా నటించగా ప్రభాస్ సినిమాకు వాయిస్ అందించారు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో భారీగా కలెక్షన్లను రాబడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.