ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లతో టీమిండియా మాట్లాడకుండా వారికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి ఆటగాళ్లు అందరూ వెళ్లిపోయారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ పాకిస్తాన్ ఆటగాళ్లు అంటున్నారు. అయితే పహాల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ తో ఎలాంటి క్రీడా సంబంధాలు పెట్టుకోవద్దని భారత ప్రజలు కోరుతున్నారు.

ఈ కారణం వల్లనే టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో మాట్లాడకుండా కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయారని సమాచారం అందుతోంది. కాగా నిన్న దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహించారు. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించడంతో 15.5 ఓవర్లలోనే మ్యాచ్ విజయం సాధించింది.
Pakistani coach left embarrassed by Indian camp 👀#AsiaCup2025 #INDvsPAK #MikeHesson #CricketTwitter pic.twitter.com/Ipfo0KMIOz
— InsideSport (@InsideSportIND) September 14, 2025