గణేశ్‌ నిమజ్జనంలో అపశుృతి.. స్వర్ణ వాగులో బాలుడి గల్లంతు

-

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గణపయ్యకు తెల్లవారుజామునే చివరి పూజ చేసి గంగమ్మ ఒడికి చేర్చేందుకు పయనమవుతున్నారు. దారి పొడవునా బ్యాండ్ బాజాలతో, నృత్యాలతో కోలాహలం చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

సిద్దాపూర్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. సిద్ధాపూర్‌లో స్వర్ణ వాగులో నిమజ్జనానికి గణపతులు క్యూ కట్టాయి. భక్తులతో డ్యాన్సులు, భజనలతో స్వర్ణ వాగు వద్ద సందడి మొదలైంది. కానీ ఇంతలోనే ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది.

గణేశ్ నిమజ్జనం చేస్తుండగా ఓ బాలుడు స్వర్ణ వాగులో పడి గల్లంతయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు. గజఈతగాళ్లను రంగంలోకి దించి బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాలుడి అదృశ్యంతో ఒక్కసారిగా స్వర్ణ వాగు పరిసరాల్లో విషాదం నిండింది. గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో ఉత్సాహం అంతా నీరుగారింది. బాలుడిని క్షేమంగా ఒడ్డుకి చేర్చాలని అక్కడున్న వాళ్లంతా గణపయ్యను వేడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version