మొయినాబాద్‌‌లో ముజ్రా పార్టీ.. 20 మంది అరెస్టు

-

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే కొందరు పోలీసులు లొకేషన్‌కు చేరుకున్నారు. పుట్టిన రోజు వేడుకల పేరుతో ఈ ముజ్రా పార్టీ నిర్వహించినట్లు పోలీసుల నిర్దారించారు.

పక్కా సమాచారం మేరకే పోలీసులు దాడులు జరపగా..ఏడుగురు యువతులు సహా 20 మందిని అరెస్టు చేశారు. అక్కడ పెద్దమొత్తంలో మద్యం, హుక్కా, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ నిర్వాహకులు యువతులను తీసుకొచ్చి ఇక్కడ ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news