బాబుకి బీపీ పెంచేసే సంఘటన ఇది!

-

రాష్ట్రం సంగతి కాసేపు పక్కన పెడితే… సుమారు 30 ఏళ్లుగా నెత్తిన పెట్టుకున్న నియోజకవర్గం అది! ఆ నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన ఆశీస్స్తులే ఆయనను ఓటమి ఎరుగని “ఎమ్మెల్యే”ని చేసింది! అయినా కూడా ఆయనకు ఆ నియోజకవర్గ ప్రజలపై విశ్వాసం లేకుండా పోయిందంట! అందుకు సాక్ష్యంగా… ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా… తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న చందంగా వ్యవహరించడమేనట! ఇంతకూ ఇంతలా బాదపడుతున్నది ఎవరో తెలుసా… కుప్పం నియోజకవర్గ ప్రజలు! ఎవరికోసమో తెలుసా… చంద్రబాబు కోసం!

అవును.. 30 ఏళ్లుగా నెత్తిన పెట్టుకున్న కుప్పం నియోజకవర్గ ప్రజలే తాజాగా చంద్రబాబు పరువు తీసేపనికి పూనుకున్నారు! ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ ఈ నియోజకవర్గానికి ఏమి చేశారు.. పోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఈ ప్రాంతం గురించి ఏమి పోరాడారు అనే సంగతులు కాసేపు పక్కన పెడితే… కనీసం కరోనా సమయంలో అయినా కంటికి కనిపించకుండా పోయారని బాదపడుతున్నారు కుప్పం ప్రజలు. ఇందులో భాగంగా… స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబునాయుడి ఆచూకీ తెలిపాలని కుప్పం ముస్లిం మైనారిటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఫైరోజ్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఒక్క సంఘటన సరిపోదా… 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఒక్కసారిగా పడిపోవడానికి!! అక్కడితో ఆగారా… ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు సలహాలు, సూచనలు కుప్పం ప్రాంతానికి ఎంతో అవసరం ఉందని… ఆయన కోసం పలుచోట్ల వెతికినా ఆచూకీ ఏమాత్రం దొరకలేదని… చంద్రబాబును వెతికి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కుప్పం ప్రజలను ఆదుకునేలా చూడాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారట!!

రాష్ట్రం సంగతి దేవుడెరుగు కానీ… కనీసం కుప్పం విషయంలో అయినా బాబు కాస్త రాజకీయాలు పక్కనపెట్టి, వారికి అన్ని విధాలుగా సాయం చేయాలని అంత కోరుకుంటున్నారు. పోనీ వృద్ధులకు.. కరోనా తొందరగా ఎఫెక్ట్ అవుతుందని భయపడి బాబు రాలేకపోయినా… కనీసం స్థానిక నాయకులకు చెప్పి, నిత్యావసర సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉన్నా… ఆ దిశగా ప్రయత్నించలేదని కుప్పం వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారంట. దీంతో… కుప్పంలో పరిస్థితే ఇలా ఉంటే… ఇక రాష్ట్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతల పరిస్థితి ఏమిటి? అని తెగ ఆందోళన చెందుతున్నారంట తెలుగు తమ్ముళ్లు! ఎలాంటి చంద్రబబుకు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ కరోనా అని… కరోనా పై కారాలు మిరియాలు నూరేస్తున్నారంట!!

Read more RELATED
Recommended to you

Exit mobile version