వారంలోపు తెలంగాణాలో కేసులు తగ్గుతాయి, హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.

-

వారంలోపు భారీగా కరోనా కేసులు తగ్గుతాయని తెలంగాణా ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేంద్ర వ్యాఖ్యానించారు. రాంజాన్ ప్రార్దనలు ఎవరి ఇళ్లల్లో వాళ్లే ప్రార్ధన చేసుకోవాలన్నారు ఆయన. ఇఫ్తార్లు నిర్వహించుకోవద్దని విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ లో కమ్యూనిటీ వ్యాప్తి బయట పడలేదన్నారు.ప్రతి రోజు 30 నుంచి 40 మంది డిశ్చార్జ్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన సంఖ్య వారి కూడా చాలా తక్కువగా ఉందన్న ఈటెల… లక్ష కేసులు వచ్చిన ట్రీట్మెంట్ చేసే సత్తా ఉందని స్పష్టం చేసారు. నలుగురు ఐదుగురు మినహా అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

కరోనా నివారించగలం అని నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. తెలంగాణలో 6 కుటుంబాల్లో 81 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆయన వివరించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు నమ్మకాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.

తెలంగాణా పని తీరుని అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయన్నారు ఈటెల. డాక్టరల్ను ,నర్సులను అవమానిస్త్తే వాళ్ళని వారే అవమానించుకున్నట్టే అన్నారు. మిగతా అన్ని జిల్లాలో కూడా వైరస్ చాల తక్కువగా ఉందని, తెలంగాణాలో ఈరోజు కొత్తగా ఆరు కేసులు వచ్చాయని వివరించారు.మర్కజ్ వెళ్లిన వారిలో హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఈటెల పేర్కొన్నారు.మే 5 న పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని, ఏది ఏమైనా ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. ప్రభుత్వం నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరిస్థితి మెరుగుపడితే మినహాయింపులు ఉంటాయని ఈటెల వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version