తప్పతాగిన సీఎఫ్‌వో.. ఓ మహిళ ఇంట్లో బట్టలు లేకుండా నైట్‌ అంతా…!!

-

తాగితే వచ్చే ఆ మైకంలో..ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. మత్తులో మనసుకు అనిపించింది చేసేస్తాం.. అయితే ఒక కంపెనీకి సీఎఫ్‌వో స్థాయి వ్యక్తులు తాగినా డీసెంట్‌గా ఉంటారు. రెండు పెగ్గులు తాగామా..కారెక్కి ఇంటికి వెళ్లామా అన్నట్లు ఉంటారు.. కానీ ఇక్కడ ఓ సీఎఫ్‌వో తప్పతాగి ఎవరో ముక్కు మొఖం తెలియని మహిళ ఇంట్లోకి నిద్రపోయాడట.. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్‌ అవుతుంది.
 అమెరికాకు చెందిన ప్రముఖ మీట్‌ ప్రాసెసింగ్ కంపెనీ అయిన టైసన్‌ ఫుడ్స్‌ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) జాన్‌ ఆర్ టైసన్‌.. కంపెనీ ఫౌండర్‌ మనుమడైన టైసన్‌, కంపెనీ పగ్గాలు చేపట్టిన నాలుగో జనరేషన్‌గా పేరుగాంచాడు. అయితే ఫూటుగా మద్యం సేవించిన టైసన్‌ ఓ మహిళ ఇంటికి వెళ్లి బట్టలు విప్పేసి ఎదురుగా ఉన్న మంచంపైన నిద్రపోయాడు. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి తన ఇంట్లో మంచంపై గుర్తించిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన అర్కాన్సస్‌లో చోటుచేసుకుంది. పోలీసులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా అతన్ని టైసన్‌ ఫుడ్స్‌ సీఎఫ్‌ఓగా గుర్తించారు. టైసన్‌ను నిద్రలేపేందుకు ఎంత ప్రయత్నించినా మత్తు నుంచి పూర్తిగా తేరుకోకపోవడంతో మేలుకోలేదు.
మద్యం మత్తులో ఉన్నట్లు గమనించిన పోలీసులు వాషింగ్టన్‌ కౌంటీలోని డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి, 415 డాలర్ల బాండ్‌ తీసుకుని టైసన్‌ను విడచిపెట్టారట… కోర్టు ఎదుట డిసెంబర్ 1న హాజరుకావల్సిందిగా నోటీసులు కూడా జారీ చేశారు. అయితే టైసన్‌ ఫుడ్స్‌ కంపెనీ మాత్రం ఈ ఘటనపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఏది ఏమైనా.. సామాన్యులు ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు.. ఇలా ఒక స్థాయికి వెళ్లాక తాగి ఆగం చేస్తే..అదే పెద్ద వార్త అవుతుంది కదా..! కాబట్టి.. జాగ్రత్తగానే ఉండాలి. ప్రస్తుతం ఈ వార్త తెలిసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరికొందరు ఇష్టం వచ్చినట్లు కమెంట్‌ చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version