మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు లేసులు కట్టిన వ్యక్తి మిథున్ రెడ్డి :మంత్రి రాంప్రసాద్ రెడ్డి

-

రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైందని ఏపీ రవాణా, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొలగొట్టింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తనపై అవాకులు చవాకులు పేలితున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏదో అన్యాయం జరిగినట్లు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.

వైఎస్ జగన్‌కు లేసులు కట్టిన వ్యక్తి మిథున్ రెడ్డి. అలాంటి వ్యక్తులు నాపై కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు . గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాపాలకు నేడు వాళ్ల కళ్లల్లో రక్తం వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బినామీగా ఉంటూ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరో అందరికీ తెలుసు. రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా మారింది అని ధ్వమెత్తారు. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల చరిత్ర గురించి అందరికీ తెలుసు. వారు చేసిన అన్యాయాలపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం” అని ఆయన అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version