రేవంత్ రెడ్డి ఆదేశంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాను : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

-

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పు అనంతరం ఇవాళ కార్యకర్తలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. తనతో పాటు కార్యకర్తలు నడవాలని కోరుతున్నానని, గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్‌లో చేరి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని, అదే తరహాలో తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు.

ఏ పార్టీలో ఉన్నా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నా చేరికపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాచారం లేదని వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక వ్యహరహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా తన సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ హై కమాండ్ జీవన్ రెడ్డిని బుజ్జగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version