మయన్మార్ లో తీవ్ర ఉద్రిక్తలు నెలకొనడంతో మిజోరాం సరిహద్దుల ద్వారా మయన్మార్ సైన్యం ఇండియాలోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా …మయన్మార్ నుంచి దేశంలోకి స్వేచ్ఛాయుత రాకపోకలు నియంత్రిచేందుకు ఫెన్సింగ్ నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు. దీంతో స్వేచ్ఛాయుత సంచారానికి ముగింపు పలుకతామనీ తెలిపారు.
మయన్మార్‌లో మిలిటరీ పాలన నేపథ్యంలో కొంతకాలంగా తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయి. సాయుధ బృందాలు ,ప్రజాస్వామ్య అనుకూలవాదులు కూటమిగా ఏర్పడి మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించారు.
అరాకన్ ఆర్మీ తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో సైనికులు మిజోరంలోని లాంగ్‌ట్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మయన్మార్ ఉద్రిక్తతల టైంలో.. స్వేచ్ఛాయుత సంచారంపై మిజోరాం ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది.