బంజారాహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం…

-

బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 4లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న మూడు కార్లకు మంటలు అంటుకోవడంతో కాలి బూడిదయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4. లోని సరిత రెసిడెన్సీ వద్ద అగ్నిప్రమాదం జరిగిందని జూబ్లీహిల్స్ ఫైర్ ఇన్స్పెక్టర్ సాయి వెల్లడించారు. వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ టీంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.పార్కింగ్ ప్లేస్ లో ఉన్న ఓమినీ కారు ఇంజన్ లో నుంచి మంటలు చెలరేగడంతో , ఆ తర్వాత పక్కనే పార్క్ చేసి ఉన్న రెండు కార్లలో మంటలు వ్యాపించాయని తెలిపారు. కాగా.. పార్కింగ్ ప్లేస్ లో కార్లలో మంటలు వ్యాపించడంతో సరిత రెసిడెన్స్ రెండవ అంతస్తు వరకు ఎగసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news