నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ డైలాగ్స్ కు రాష్ట్రంలో మంచి పేరుంది. ఈ నియోజకవర్గం నుండి రెండు సార్లు వరుసగా వైసీపీ నుండి గెలవడంతో మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గాన్ని మార్చడంతో అనిల్ పదవిని కోల్పోయారు. అప్పటి నుండి సొంత నియోజకవర్గంలో అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. సొంత బాబాయ్ సైతం తనను వెన్నుపోటు పొడవడంతో ఇప్పుడు ఒంటరి అయ్యాడు. కాగా వచ్చే ఎన్నికల్లోనూ ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అనిల్ కుమార్ యాదవ్ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ రోజు నెల్లూరు లోని ఒక కల్యాణమండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన అనిల్ కార్యకర్తలే నా ప్రాణం అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్: కార్యకర్తలే నా బలం…
-