బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఖైరతాబాద్ నియోజకవర్గంలో పర్యటించగ ఓ అనుభవం ఎదురైంది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 14లోని ఆదర్శ్ నగర్ బస్తీకి వెళ్లాడు. బస్తీ వాసులు అతని నిలదదీశి ప్రశ్నించారు. వారు గత పది రోజులుగా వరద నీటిలో నివసిస్తున్నారు. అయితే వారి సమస్య ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే దానం వెళ్తే వారు ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇన్ని రోజులు ఏమయ్యారు అని దానం నాగేందర్ ను ఆదర్శ్ నగర్ బస్తీ వాసులు నిలదీశారు.
బస్తీల్లో నిలిచిపోయిన నీళ్లను వెంటనే తొలగించాలని జీహెచ్ఎంజీ అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు ఎమ్మెల్యే దానం. నాలా రీటర్నింగ్ వాల్ నిర్మాణం పనులు జరుగుతున్న క్రమంలో నీళ్లు బస్తీలోకి రాకుండా తాత్కాలిక గోడను నిర్మించాలని అధికారులకు సూచించారు. వరద నీటిలో ఉన్న ఇండ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నష్టపరిహారం ఇవ్వాలని బస్తీవాసులు కోరారు. 30 కుటుంబాలకు రూ.20 వేల చొప్పున అందిస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.