WARNING : థియేటర్ లో వీడియోలు తీసి స్టేటస్ లు పెడుతున్నారా జాగ్రత్త … !

-

థియేటర్ లలో కొత్తగా విడుదలైన సినిమాలను మొదటి షో చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అందుకోసం టికెట్ ధర ఎంతైనా పరవాలేదు అనుకుని కొనుక్కుని మొదటి రోజు సినిమా చూస్తారు. కానీ అంతటితో సినిమా చూసి వచ్చేస్తారా అనుకుంటే… అలా కుదరదు సినిమాలో నచ్చిన ముఖ్యమైన సీన్ లను వీడియోలు తీసి మళ్ళీ వాటిని సోషల్ మీడియా యాప్ లలో అప్లోడ్ చేయడం లేదా వాట్సాప్ స్టేటస్ లుగా పెట్టుకోవడం చేస్తుంటారు.అయితే ఇది కూడా ఒకవిధమై పైరసీ అని చెప్పాలి. అందుకే ఇకపై థియేటర్ లలో వీడియో లు లేదా ఫోటోలు తీయకుండా కఠినమైన చర్యలు తీసుకున్న దిశగా కేంద్ర సినిమాటోగ్రఫీ చట్టాన్ని మార్పులు చేసి కఠినమైన నియమ నిబంధనలను తీసుకువరాడానికి చూస్తోంది. ఈ చట్టం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనధికారికంగా ఎటువంటి ఫోటోలు లేదా వీడియోలు థియేటర్ లో తీయడానికి లేదు.

ఇలా చేసినవారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు భారీగా జారినామానా విధించనున్నట్లు తెలుస్తోంది. ఇకపై సినిమా క్లిప్ లను స్టేట్స్ లుగా పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version