మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల ఉద్యమం బోగస్ అన్న ఆయన.. అందులో ఉన్నవారంతా టీడీపీ కార్యకర్తలేనని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి సదుపాయం కల్పించినందుకు జై అంటామని, కానీ రాజధానిలోని లింగులింగుమంటూ ఉన్న ఓ 8 ఊరోళ్లు మాత్రం గొప్ప పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని మాట్లాడారు. పత్రికల్లో బొమ్మలు వస్తుండడంతో వాటిని చూసుకునేందుకే ఆందోళన చేస్తున్నట్టు అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ఇదే విషయాన్ని ఓ వ్యక్తి నేరుగా ఎమ్మెల్యే ధర్మానకు ఫోన్ చేసి చెప్పారు. రైతుల ఆందోళనల పట్ల మీరు వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. అయితే ఎమ్మెల్యే ధర్మాన కూడా అంతే సున్నితంగా స్పందించారు. ‘మీకు నచ్చలేదు కదా.. క్షమించేయండి.. అమరావతి వచ్చినప్పుడు కలుద్దాం.. నమస్కారం..’ అంటూ ముగించేశారు.