ఢిల్లీ పైసలు ఇచ్చినా గల్లి విడుదల చేయడం లేదు : హరీష్ రావ్

-

సిద్దిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్ లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలికాలంలో విద్యార్థులు వేడినీళ్లు రాక, దుప్పటి రాక ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగు నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదు అని అన్నారు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు. మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి.

పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారా ప్రభుత్వం ఫెయిల్ అనిపిస్తుంది. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి మాటలు అధికారులు వినడం లేదా లేక ముఖ్యమంత్రి ఊరికే చెప్పానని అధికారులకు చెబుతున్నారా. ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా విలువ లేదా.. తక్షణమే అన్నిచోట్ల మిస్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు రివ్యూ చేయడం లేదు.. ఢిల్లీ పైసలు ఇచ్చినా గల్లి విడుదల చేయడం లేదు అని హరీష్ రావ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news