సమయం ఇవ్వడానికి ఈడీ నిరాకరణ.. కాసేపట్లో విచారణకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి

-

మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూర్‌ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వస్తారని సమాచారం. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తరఫున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వెళ్లిన ఆయన పీఏ శ్రవణ్‌.. అధికారులు అడిగిన వివరాలు ఇవ్వటానికి సమయం కోరారు. ఈ అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. సమయం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి కాసేపట్లో ఈటీ విచారణకు హాజరవ్వనున్నట్లు తెలుస్తోంది.

మనీలాండరింగ్ కేసులో వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఇవాళ విచారణకు రావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 2015 ఏప్రిల్ నుంచి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందిచంటతో పాటు.. 10 అంశాల బయోడేటా వివరాలతో రావాలని ఆదేశించింది. విద్యార్హతలు, కేసుల వివరాలను ఈడి ఇచ్చిన ఫార్మాట్లో సమర్పించాలని ఆదేశం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం తన నివాసం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి…నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌త ఆయన భేటీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version