బ్రేకింగ్‌ : సీఎం జగన్ తో భేటీ అయిన ఎమ్మెల్యే రోజా..

-

ఏపీఐఐసి చైర్మన్, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన ఆమె… సీఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రోజా తన ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్బంగా సీఎంను కలిసిన ఫోటోను కూడా షేర్ చేశారు. రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించినా జగన్ మాత్రం ఆమెకు కేబినెట్‌లో చోటు దక్కలేదు.

మంత్రిపదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రోజా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను రోజా సీఎంను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం రోజా ఏపీఐఐసీ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version