రోజా అలకకు కారణం అదేనా

-

నగరి ఎమ్మెల్యే రోజా సడన్ గా ఎందుకు సైలెట్ అయ్యారు..ప్రస్తుతం అధికారపార్టీ నడుస్తోన్న చర్చ ఇదే. ప్రతిపక్షం పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యే రోజా ఒక్కసారికి ఎందుకు దూకుడు తగ్గించారు..తిరుపతిలో పవన్ కళ్యాణ్ విమర్షలను రోజా ఎందుకు లైట్ తీసుకున్నారు..ప్రివిలేజ్ కమిటీ భేటిలో కన్నీరు పెట్టుకున్న రోజా సోంత పార్టీ నేతలతో ఇబ్బంది పడుతున్నారా దీనిపై వైసీపీ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ నడుస్తుంది.

వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వానికి రోజా లక్ష్యంగా మారారు. దాంతో రెండోసారి ఎమ్మెల్యే కాగానే కేబినెట్‌లో చోటు దక్కుతుందని రోజా ఆశించారు. కానీ మంత్రివర్గంలో బెర్త్‌ దక్కలేదు. చివరకు APIIC చైర్మన్‌గా పదవి ఇచ్చినా.. అందులో అసంతృప్తిగానే కొనసాగుతున్నారు. దీనికి తోడు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు.. నగరిలో తన ప్రత్యర్థులకు పదవులు ఇవ్వడంపై రగలిపోతున్నారట. ఈ కారణంగానే ఆమెలో మునుపటి దూకుడు లేదన్నది కొందరి వాదన.

ఒకప్పుడు వైసీపీని ఎవరేమన్నా అస్సలు ఊరుకునేవారు కాదు రోజా. అందరికంటేముందే విరుచుకుపడి అవతలి వారిని డిఫెన్స్ లో పడేసేవారు. టీవీలో చర్చలైనా ఆమెనే పిలిచేవారు. అలాంటిది రోజా ఎక్కడున్నారు ఎందుకు సైలెంట్‌ అయ్యారు అన్నదే ప్రధానంగా మారిపోయింది. ఇటీవల కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరై కన్నీళ్లు పెట్టుకున్నారు రోజా. జిల్లాలో, నియోజవర్గంలో అధికారులు పట్టించుకోవడం లేదన్నది ఆమె ఆరోపణ. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామిలే కారణమని పరోక్షంగా ప్రస్తావించారట.

అయితే ఈ నేతలతో రోజాకి ఉన్న గొడవ పార్టీలో మొదటి నుంచి ఉన్నదే. కాకపోతే రోజా రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకాస్త ఎక్కువైందట. రాష్ట్రంలో రాజకీయం వాడీ వేడిగా ఉన్నా.. కీలక పరిణామాలు జరుగుతున్నా.. వాటిల్లో ఎక్కడా రోజా పేరు వినిపించడం లేదు.. ఆమె కామెంట్స్‌ లేవు. మౌనంగా ఉండిపోతున్నారు. మరి.. ఎన్నాళ్లిలా మౌనంగా ఉంటారో రోజాకే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version