ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య హోరాహోరీ రాజకీయ యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు మాటల యుద్ధం చేస్తున్నాయి..అసలు ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా సరే..ఏదో ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నట్లు రాజకీయం నడిపిస్తున్నారు. తాజాగా కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది.
ఇటీవల టీడీపీ నేతలు..వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేస్తున్నారు..అలాగే వైసీపీ పని క్లోజ్ అయిపోయిందని, నెక్స్ట్ వచ్చేది తమ ప్రభుత్వమే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా అచ్చెన్న…నెక్స్ట్ టీడీపీకి 160 సీట్లు వస్తాయని, తాము అధికారంలోకి రావడం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇక అచ్చెన్న కామెంట్లపై రోజా స్పందించారు…తాజాగా వుమెన్స్ డే సందర్భంగా సీఎం జగన్ సమక్షంలోనే రోజా…టీడీపీపై సెటైర్లు వేశారు..టీడీపీ 160 కాదు కదా…23 సీట్లు మళ్ళీ గెలిస్తే గ్రేట్ అన్నట్లు మాట్లాడారు.
ఇక రోజా వ్యాఖ్యలపై అచ్చెన్న కూడా కౌంటర్ ఇచ్చేశారు.. రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని అచ్చెన్న ప్రకటించారు. ఆ వెంటనే రోజా కూడా కౌంటర్ ఇచ్చేశారు.. అచ్చెన్నాయుడుకు తిన్నది అరగకుంటే రాజీనామా చేసి గెలవమనండి అంటూ మరో సవాల్ విసిరారు.. తాను గెలిస్తే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కాదు.. వాళ్లు 23 మంది రాజీనామా చేసి పోటీ చేసి మళ్లీ గెలిస్తే తానే పోటీ చేయను అంటూ సంచలన ప్రకటన చేశారు.
ఇలా ఇద్దరు నేతల మధ్య సవాళ్ళ పర్వం నడిచింది గాని…వీరిలో ఎవరు కూడా సవాల్ కూడా అంగీకరించే పరిస్తితి ఉండదనే చెప్పాలి…ఏదో పైకి మాత్రం సవాళ్ళు చేసుకుంటారు తప్ప..వాటికి సై అనరు. మరి చూడాలి ఇంకెంత కాలం వీరి మధ్య సవాళ్ళు నడుస్తాయో చూడాలి.