రామున్ని కూడా రాజకీయాల్లోకి లాగిన దుర్మార్గపు పార్టీ బిజెపి – సీతక్క

-

బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పై కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో బిజెపి తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. అసత్య పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ బిజెపి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికుల త్యాగాలను తమ త్యాగాలుగా చెప్పుకొని బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిందన్నారు.

 

రామున్ని కూడా రాజకీయాలలోకి లాగిన దుర్మార్గపు పార్టీ బిజెపి అని విమర్శించారు. బిజెపి నేతలకు నీతి, జాతీ ఉంటే అదాని వ్యవహారంపై జేఏసీ వేయాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను దోచుకోవడానికి అదాని ని బిజెపి అడ్డం పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ నోరు నొక్కాలని బిజెపి తప్పుడు ఆలోచనలు చేస్తుందన్నారు సీతక్క. మోడీ జీవితం, రాహుల్ గాంధీ జీవితాన్ని జనం ముందు పెడదాం రండి అంటూ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version