అక్కడ సోనూసూద్.. ఇక్కడ సీతక్క ఇద్దరిదీ పెద్దమనసే..?

-

ప్రస్తుతం దేశంలో మహామహులు సైతం పేదల కష్టాలు పట్టకుండా ఉంటే సాధారణ వ్యక్తులు సైతం మహత్తర కార్యక్రమాలను చేపడుతున్నారు. వలస కార్మికుల బాధల ను తీర్చడంలో సోను సూద్ చేసిన సహాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహాయం పొందిన వారే కాదు దేశ ప్రజల అందరి ఆశీర్వాదం సోను సూద్ కి లభించింది అని చెప్పాలి.

ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా తన పెద్ద మనసు చాటుకున్నారు. సాదా సీదా ఎమ్మెల్యే అయినప్పటికీ… ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చారు. వలస కూలీలు ఉపాధి కోల్పోయి ప్రస్తుతం పస్తులు ఉంటున్న క్రమంలో.. ఆకలితో అలమటిస్తున్న ఆడబిడ్డల ఆకలి తీర్చేందుకు ముందుకు కదిలారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. వంద రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో 1000 గ్రామాల్లోని లక్ష కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పేదల ఆకలి తీర్చే పెద్ద మనసు ఉన్న మంచి మనిషిగా మన్ననలు పొందుతున్నారు ఎమ్మెల్యే సీతక్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version