కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ గార్డులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్..!

-

ఏపీలోని కృష్ణ పట్నం పోర్టు సెక్యూరిటీ గార్డులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రదర్శించిన ఆగ్రహం వైరల్ గా మారింది. కృష్ణ పట్నం పోర్టులో కొన్ని రోజులుగా నిలిచి పోయిన కంటైనర్ టెర్మినల్ పనులు నిలిచిపోయాయి. దీంతో వీధిన పడ్డ ఉద్యోగుల కోసం పోర్టు సీఈవోతో మాట్లాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం పార్టీల నేతలు పోర్టుకు వెళ్ళారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బంది మీడియాను అడ్డుకున్నారు.

దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాను అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. అయినప్పటికి సెక్యూరిటీ సిబ్బంది వినిపించుకోకపోవడంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపైకి దూసుకెళ్ళి కొట్టినంత పని చేశారు. వారిని ఆగ్రహంతో నెట్టివేశారు. నెల్లూరులో కృష్ణపట్నం టెర్మినల్ తరలింపుకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అన్ని పార్టీలు మద్దతుతో పోరాడుతామన్నారు. 10వేల మంది ఉద్యోగాలు పోయాయని, టెర్మినల్ ను పునరుద్ధరించాలని ఆదానీని కోరుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version