టిడిపి జనసేన పార్టీలా తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో కాకినాడ రూరల్ జనసేనకి కేటాయించారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. 20 ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతనికి కృషి చేసిన ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తిని కాదని జనసేనకి టికెట్ ఇవ్వడంతో గందరగోళానికి దారి తీసింది. ఇప్పటిదాకా చంద్రబాబు ని ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడిన వారు ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత వైఖరినే తప్పుపడుతున్నారు.
ఈ సీటుని పొత్తులో భాగంగా జనసేనకి కేటాయించడంతో కాకినాడ రూరల్ లో తెలుగు తమ్ముళ్లు నిరసనలు తెలుగు మొదలయ్యాయి. చంద్రబాబు తీరుపై ఆ పార్టీని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కాకినాడ రూరల్ నుండి 2014లో పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచిన పంతం నానాజీని ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలపడం సరికాదని అంటున్నారు.