టీడిపిది బస్సు యాత్ర కాదు.. బోగస్ యాత్ర: ఉష శ్రీ చరణ్

-

ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలు వరుసగా యాత్రల పేరుతో ప్రజల మద్దతును కూడా గట్టుకుని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రము అంతటా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తుండగా, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనం మీద యాత్ర చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నాడు. కాగా తాజాగా మరో యాత్రకు టీడీపీ శ్రీకారం చుట్టింది, బస్సు యాత్ర గురించి వైసీపీ ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన యాత్ర బస్సు యాత్ర కాదు.. బోగస్ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. అంతే కాకుండా ఈ బస్సు యాత్రపై టీడీపీ నేతలే రాళ్లు వేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది అన్నారు. గతంలో ప్రజలను దారుణంగా మోసం చేసిన తర్వాత కూడా ఏ మొహం పెట్టుకుని ఇటువంటి పనికిరాని యాత్రలు చేస్తున్నారు అంటూ మండిపడింది ఉష శ్రీ చరణ్.

పవన్ సభలకు ఎవ్వరూ రాకపోయినా సందర్భాలను మనము చూశాము. ఇప్పుడు బస్సు యాత్రకు కూడా ఏ ఒక్కరూ కూడా రారు అని శ్రీ చరణ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version