ఓ ఎమ్మెల్యే గుట్కా తిని అసెంబ్లీ హాల్ ఎంట్రీ మెట్ల వద్ద ఊసాడు.ఈ వికృత ఘటన యూపీలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. స్పీకర్ సతీశ్ మహానా అసెంబ్లీలోకి వెళ్తుండగా.. ఆ విషయాన్ని గుర్తించాడు.వెంటనే భద్రతా సిబ్బందిని పిలిపించి ఈ విషయంపై ఆరా తీశారు.
ఓ ఎమ్మెల్యే గుట్కా తింటూ వచ్చారని, సరిగ్గా మెట్ల వద్ద ఊశారని భద్రతా సిబ్బంది గుర్తించి స్పీకర్‌కు చెప్పగా..ఈ పని చేసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్చందంగా ముందుకు వచ్చి అంగీకరించకపోతే తానే బయటపెడతానని హెచ్చరించారు. కాగా, చట్టాలు చేసే శాసనసభలో ఎలా నడుచుకోవాలో కూడా తెలియదా?అని సదరు ఎమ్మెల్యేపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గుట్కా తిని అసెంబ్లీలో ఊసిన ఎమ్మెల్యే
యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీలోకి వెళ్తూండగా.. ఎంట్రీ వద్ద ఎవరో గోడ మీద గుట్కా తిని ఊసినట్లుగా గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందిని ఆరా తీశారు. ఓ ఎమ్మెల్యే అలా చేశాడని గుర్తించారు.
ఈ పని చేసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్చందంగా… pic.twitter.com/s31HoxgLMD
— Telugu360 (@Telugu360) March 4, 2025