నైజాంలో సినిమాలు చూడకపోతే అడుక్కు తినాల్సిందే : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

-

ఎవరికి ఏం సాయం కావాలని అనుకున్న సోను సూద్ కి ఫోన్ చేసేవారు. ఎన్నో లెజెండరీ సినిమాలు తీసింది ఇండస్ట్రీ. అలాంటి సినిమాలను వేలు పెట్టి టికెట్లు కొంటారు అభిమానులు. కానీ వాళ్లకు ఏమైనా అయ్యింది అంటే.. ఇండస్ట్రీ వాళ్ళు స్పందించడం లేదు అని MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ANR, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు దివిసీమ మునిగిపోతే… సినిమా పరిశ్రమ జోలె పట్టింది. అలాంటి వాళ్లకు వారసులం అని చెప్పే వీళ్ళు సాయం చేసేందుకు ముందుకు వచ్చారా అని ప్రశ్నించారు.

కావేరి నది వివాదంలో రజినీకాంత్ ఇండస్ట్రీ నీ ఏకం చేసి నిలబెట్టారు. కానీ మన సూపర్ స్టార్ లు ఏనాడైనా ముందుకి వచ్చారా.. చిరంజీవి ఒక్కరే బ్లడ్ బ్లాంక్ పెట్టి ఆదుకున్నారు. చిరంజీవి వారసులం అని చెప్పుకునే వారికి ఆయన ఆదర్శం ఏమైంది. సినిమా హీరోలు.. ఏ గ్రామాలను కానీ.. ఆసుపత్రులను దత్తత తీసుకున్నారా అని ప్రశ్నించిన ఆయన.. నైజాం ఏరియా సినిమాలు చూడకపోతే సినిమా వాళ్ళు అడుక్కు తింటారు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version