అవాస్తవాలను ప్రచారం చెయ్యడంలో హోంమంత్రి సుచరిత సూపర్: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

-

అవాస్తవాలను ప్రచారం చెయ్యడంలో హోంమంత్రి సుచరిత, సజ్జల రెడ్డి గోబెల్స్ ని మించిపోయారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. గతంలో చంద్రబాబు సర్కార్ ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్​కు పాల్పడిన్నట్టు ఆధారాలతో సహా నిరూపించాం అంటున్న వారు ఆ ఆధారాలు ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. తమ పత్రికలో ఎందుకు ప్రచురించలేదని నిలదీశారు.

budda venkanna

ఎన్నికలకు ముందు సజ్జల రెడ్డి ఇదే అంశంపై కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆధారాలు చూపించలేక చేతులెత్తేసి కేసు విత్ డ్రా చేసుకున్నారని మండిపడ్డారు. తమరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమైతే హోంమంత్రి ఏడాదిన్నరలో ఏం చర్యలు తీసుకున్నట్టని నిలదీశారు. కేవలం ఎన్నికల్లో లబ్ది కోసం కేసులు వేశారని ఆరోపించారు. ఎన్నికల తరువాత ఇదే అంశంపై వైవీ సుబ్బారెడ్డి వేసిన కేసు వెనక్కి తీసుకున్నారన్నారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ టెక్నాలజితో ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసులు వేసి ఎందుకు వెనక్కి తగ్గారో సజ్జల రెడ్డి , వైవీ సుబ్బారెడ్డిని హోంమంత్రి ప్రశ్నించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version