వైసీపీలో ట్విస్ట్..ఆ ఎమ్మెల్యేలు షాక్ ఇస్తారా?

-

ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఓ వైపు స్థానిక సంస్థలు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ గెలుచుకున్నా..పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టి‌డి‌పి విజయం సాధించింది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు..టి‌డి‌పి ఎమ్మెల్యేలపై దాడి చేయడం మరో సంచలనంగా మారింది.

ఈ అంశాలని పక్కన పెడితే..ఈ నెల 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వైసీపీకి 7 స్థానాలు గెలుచుకునే మెజారిటీ ఉంది. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది..పైగా టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి వెళ్లారు. దీంతో 156 అవుతారు. దీంతో 7 స్థానాలు గెలవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది..టి‌డి‌పి తమకు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. మామూలుగా టి‌డి‌పికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జంప్ అయిన నలుగురితో కలిపి విప్ జారీ చేశారు.

దీంతో టి‌డి‌పికి వ్యతిరేకంగా ఓటు వేస్తే వేటు పడే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో వైసీపీలో కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పటికే వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. కోటంరెడ్డి, ఆనం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారు టి‌డి‌పికి మద్ధతు ఇస్తే టి‌డి‌పి బలం 21 అవుతుంది. ఇంకా ఇద్దరు, ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

అదే జరిగితే వైసీపీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం ఖాయం. అదే సమయంలో వైసీపీ కూడా విప్ జారీ చేసింది. విప్ కు వ్యతిరేకంగా వెళితే వేటు తప్పదు. చూడాలి మరి చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ట్విస్ట్ వస్తుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version