‘పట్టభద్రులందరూ దరఖాస్తు చేసుకోండి’

-

తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌కు త్వరలో ఎన్నికలు నిర్వ‌హించేందుకు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకుంటోంది.
న‌ల్గొండ‌- ఖ‌మ్మం- వ‌రంగ‌ల్ తోపాటు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌- హైద‌రాబాద్‌- రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. ఓట‌రు న‌మోదు ప్ర‌క్రియను కూడా చ‌రుగ్గా చేపట్టేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈమేర‌కు పట్టభద్రులు ప్రతి ఒక్కరూ త‌మ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయెల్‌ తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా ఉన్న ఓటరు జాబితాను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోవద్దని సంబంధిత ఎన్నికల అధికారులకు స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ కొత్తగా నమోదు చేసుకోవాల్సిందేనని చెప్పారు. అక్టోబర్‌ 1 నుంచి నవంబరు 6వ తేదీ వరకు ఓట‌రు నమోదు ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణులైన, తత్సమానమైన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన (నవంబరు 1, 2020కి మూడేళ్ల ముందు) వారందరూ అర్హులేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయెల్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version