కరోనా తీవ్రత లేకుంటే ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండేవి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్‌తో దేశమే అతలాకుతలం అవుతోంది. మరి ఇలాంటి టైమ్‌లో ఎమ్మెల్యే కోటా ఎన్నికలు ఉంటాయా ఉండవా అని అందరూ ఎదురుచూశారు. ఇప్పుడు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎస్ఈసీకి లేఖ రాసింది. దీనిపై ఈ రోజు ఎన్నికల సంఘం స్పందించింది.
కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని, తీవ్రత తగ్గాక నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఇప్పుడు తెలంగాణలో 6 స్థానాలు, ఏపీలో 3మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలు జూన్3తో ముగుస్తున్నాయి. అయితే తాజాగా ఈసీ ప్రకటనతో వీరంతా యథావిధిగా పదవుల్లో కొనసాగనున్నారు. వీరిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. మరి రెండు ప్రభుత్వాలు వీరికే మళ్లీ అవకాశం ఇస్తాయా లేక కొత్తవారికి జై కొడుతాయా వేడి చూడాలి.