కులగణన సర్వే ప్రకారం.. బీసీల లెక్క కరెక్ట్ అని, 56 శాతం బలహీన వర్గాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో కులగణన సర్వేకి సంబంధించిన బిల్లు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు.
కులగణన సర్వేలో దాదాపు 75వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే చేశాం. గత ఏడాది ఫిబ్రవరి 04న కేబినెట్ లో ప్రవేశపెట్టాం. 42 శాతానికి బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పెట్టామని తెలిపారు. మండల్ కమిషన్ తోనే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్దత అన్నారు. వివాదాలకు తావు లేకుండా బీసీలకు న్యాయం చేయాలన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, పాయల్ శంకర్ ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.