కేటీఆర్ కు బిగ్ షాక్…ఫార్ములా-ఈ రేస్ కేసులో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఇవాళ గవర్నర్‌కు ACB నివేదిక ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ సహా మరో నలుగురి ప్రాసిక్యూషన్‌కి ACB సిద్ధం అయింది. గవర్నర్ అనుమతి రాగానే చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా… ఫార్ములా ఈ-రేసు కేసులో ఇప్పటికే కేటీఆర్ ను నాలుగుసార్లు విచారించారు ఏసీబీ అధికారులు. అర్వింద్ కుమార్ విషయంలో ఐదుసార్లు విచారణ పూర్తి అయింది. గవర్నర్ అనుమతి వస్తే చార్జ్ షీట్ ఫైల్ చేసే యోచనలో ఏసీబీ ఉంది. దీంతో కేటీఆర్ కు చిక్కులు తప్పవని అంటున్నారు.