ఆడబిడ్డల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా భద్రతకు హైదరాబాద్ యువకులు రూపొందించిన ’అభయ్ కోట్‘ సెఫ్టీ జాకెట్ ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించింది. రాష్ట్రంలో మహళా భద్రత సీఎంకేసీఆర్ ప్రధాన ఎజెండా అని కవిత అన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం షీటీమ్ లను ఏర్పాటు చేసిందని అన్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఉక్కు పాదాలు మోపుతుందని ఆమె అన్నారు.
మహిళా భద్రతకు ’ అభయ్ కోట్‘ … ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత.
-