ఈడీకి కవిత లేఖ.. 11వ తేదీన విచారణకు హాజరవుతానని సమాచారం

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు బీఆర్ఎస్‌పై.. కవిత, కేసీఆర్‌లపై విరుచుకుపడుతోంటే.. బీఆర్ఎస్ మంత్రులు.. కేంద్రం వైఖరిని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. దర్యాప్తునకు సహకరిస్తానని స్పష్టం చేశారు.

మరోవైపు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఇవాళ  విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. ఈనెల 11న విచారణకు హాజరవుతానని ఈడీకి సమాచారం అందించారు. హడావుడిగా దర్యాప్తు చేయడంలో ఆంతర్యమేంటని కవిత ఈడీని ప్రశ్నించారు. విచారణకు రావాలంటూ స్వల్పకాలంలో నోటీసులిచ్చారని.. రాజకీయ కక్షలో భాగంగానే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు.

‘చట్టపరమైన అన్ని హక్కులు ఉపయోగించుకుంటా. కోర్టు తీర్పు ప్రకారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించే అవకాశం ఉంది. అయినా నేరుగా కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటి? దర్యాప్తు పేరిట రాజకీయం చేస్తున్నట్లు అనిపిస్తోంది.’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version