హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆమె వెంట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత వస్తున్నారని తెలియడంతో ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా స్వాగతించారు.
కవిత తెలంగాణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతుని కృపతో విజ్ఞానం, భక్తి నిండాలని ఆకాంక్షించారు. ఇదిలాఉండగా, హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల శోభయాత్రలను భక్తులు నిర్వహిస్తున్నారు.దీనికి తోడు హనుమాన్ మాలధారులు, సామాన్య భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు.