పనిచేసే వాళ్లేవరో ప్రజలు గుర్తించాలి : ఎమ్మెల్సీ కవిత

-

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ‌లో విప్లవం సృష్టించిన‌ట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్ల‌వం సృష్టించ‌బోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అంటే మ‌న రికార్డులు మ‌న‌మే తిర‌గ‌రాసుకునేవాళ్లని క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. మ‌నం వేరే వాళ్ల రికార్డులు బ‌ద్ద‌లుకొట్టుడు కాదు అని క‌విత పేర్కొన్నారు. మ‌న లక్ష్యం ఒక్క‌టే ఉండాలని, గులాబీ కండువా అధికారంలో ఉన్న‌ప్పుడే తెలంగాణ ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ఉంటారన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత. గులాబీ జెండా ఎగిరే నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి జ‌రుగుతుందని, అందుకోసం 24 గంట‌లు కార్య‌క‌ర్త‌లు ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత.

గ‌తంలో మంత్రిగా ఉన్న‌ జీవ‌న్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోలేదని, ఒక‌ప్పుడు రాయిక‌ల్ వ‌ల‌స‌ల మండ‌లంగా ఉండే. ఇప్పుడు పంట‌ల‌మ‌యం అయిపోయిందని క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో కేవ‌లం 20 వేల ఎక‌రాల్లో వ‌రి సాగు జ‌రిగేది. కేసీఆర్ సీఎం అయ్యాక 65 వేల ఎక‌రాల్లో వ‌రి పంట సాగు జ‌రుగుతుంది. రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసిందని క‌విత తెలిపారు. మ‌న నాయ‌కుడు కేసీఆర్ అన్ని వ‌ర్గాల గురించి ఆలోచిస్తున్నారు. గ‌త పాల‌కులు బీడీ కార్మికుల ఓట్లు అడిగారు కానీ పెన్ష‌న్లు ఇవ్వ‌లేదు. కానీ కేసీఆర్ బీడీ కార్మికుల‌కు పెన్ష‌న్లు ఇస్తున్నారు. ఒక్క రాయిక‌ల్ మండ‌లంలోనే 16700 మంది ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్లు ఇస్తున్నాం. చేసిన ప‌నిని చెప్పాలి. చేయాల్సిన ప‌నిని బాధ్య‌త‌తో చేయించాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు క‌ల్వ‌కుంట్ల క‌విత.

Read more RELATED
Recommended to you

Exit mobile version