సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతి రావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో తమ పోరాటానికి మద్దతు తెలిపాలని కవిత జాన్ వెస్లీని కోరినట్లు సమాచారం.
శుక్రవారం హైదరాబాద్ కవాడిగూడలోని ఎంబీ భవన్‌లో జాన్ వెస్లీతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణంలో పూలే విగ్రహం ఏర్పాటు, కులగణన వివరాలు వెల్లడించడం, 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో మద్దతు కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, జాగృతి, సీపీఎం నేతలు పాల్గొన్నారు.