ఎమ్మెల్సీ వార్..బీజేపీకి టీడీపీనే ప్లస్?

-

సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవు…ఏదో అప్పుడప్పుడు పోటీలో దిగుతాయి తప్ప…గెలుపోటములని పెద్దగా లెక్క చేయవు. అసలు వీటిపై పెద్దగా దృష్టి పెట్టరు కూడా. అయితే ఏపీలో రాజకీయం ఇప్పుడు అలా లేదు…ప్రతి దానిలోనూ పై చేయి సాధించాలని అధికార వైసీపీ చూస్తుంది…ఇక వైసీపీకి పోటీగా నిలబడాలని టీడీపీ భావిస్తుంది. వైసీపీ అధికారంలో ఉండటంతో అన్నిటిలోనూ పైచేయి సాధిస్తూ వస్తుంది.

పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, ఉపఎన్నికల్లో పైచేయి సాధించిన వైసీపీ…ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్ధులని కూడా ఖరారు చేసేశారు. ఉమ్మడి విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ పేరుని ఖరారు చేసింది. అలాగే ఉమ్మడి కడప-కర్నూలు-అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేరు ఖరారు చేసింది…అయితే ఇదే స్థానానికి టీడీపీని కూడా అభ్యర్ధిని ఫిక్స్ చేసింది.

అయితే విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం స్థానానికి ఇంకా అభ్యర్ధిని పెట్టలేదు. ఇక ఇక్కడ బీజేపీ తరుపున ఎమ్మెల్సీ మాధవ్ పోటీ చేయడం ఖాయమే. 2017లో జరిగిన ఎమెల్సీ ఎన్నికలో మాధవ్…టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు టీడీపీ మద్ధతుతో మాధవ్ గెలిచారు. ఇక ఇప్పుడు జనసేన మద్ధతు బీజేపీకి ఉంది…కానీ ఆ మద్ధతు సరిపోదనే చెప్పాలి. టీడీపీ సపోర్ట్ ఉంటేనే బీజేపీకి విజయం సాధ్యమవుతుందని చెప్పొచ్చు.

మామూలు ఎన్నికలకు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు తేడా ఉంటుంది…చదువుకున్న వారు, ఉద్యోగులు ఉండటం వల్ల…ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం. కానీ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానంపై బీజేపీకి కాస్త పట్టు ఉంది…అలాగే టీడీపీకి గట్టి బలం ఉంది…జనసేన కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది…అలాంటప్పుడు టీడీపీ సెపరేట్ గా బరిలో దిగితే బీజేపీకి విజయం కష్టమే. మరి చూడాలి బీజేపీ…టీడీపీ మద్ధతు కోరుతుందో లేక జనసేన మద్ధతుతో సరిపెట్టుకుంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version