తెలంగాణ ఇచ్చిన ఆ మహతల్లికి అండగా తెలంగాణ ఉంటుంది :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరయ్యారు. అయితే.. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఈడీ కేసుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్‌ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేస్తున్న సందర్భంగా మానసిక ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా. ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. సోనియా గాంధీ కి కాంగ్రెస్ పార్టీ ఏ కాదు యావత్ జాతి అండగా ఉంటుంది.

యంగ్ ఇండియా సంస్థ వ్యాపార దృష్ట్యా ఏర్పాటు చేసిన సంస్థ కాదు. ఇది సేవ దృక్పథంతో ఏర్పాటు చేసిందని, ఇందులో ఎలాంటి మానిలాండరింగ్ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు లో రాజకీయ నిర్ణయం తీసుకుంది సోనియా అని, తెలంగాణ ఏర్పాటు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఉనికికే ప్రశ్నార్థకం అని తెలుసు అని, పేదవాడికి పట్టడన్నం పెట్టె విధంగా ఆహారభద్రత చట్టం తెచ్చారన్నారు. రైతు కూలీలకు ఉపాధిహామీ తీసుకొచ్చారు.దేశం మొత్తానికి ప్రధాన బాధ్యత తెలంగాణ పైనే ఉంది. తెలంగాణ ఇచ్చిన ఆ మహతల్లికి అండగా తెలంగాణ ఉంటుంది. ఈడీ విచారణ పూర్తియ్యే వరకు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version