రోజంతా నీరసంగా ఉంటున్నారా..? దాని వెనుక కారణాలు ఇవే..!

-

ఎంతో మంచి ఆహారాన్ని తీసుకున్నా సరే రోజంతా ఉత్సాహంగా ఉంటారు అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చాలా శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామాలు చేస్తున్నా సరే ఎంతో నీరసంగా ఉంటారు. అయితే దాని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవన విధానంలో పొరపాట్లను చేయడం, పోషకాలకు సంబంధించిన లోపంతో బాధపడటం, థైరాయిడ్, ఒత్తిడి వంటి మొదలైన కారణాలు వలన రోజంతా నీరసంగా ఉండవలసి వస్తుంది. కనుక ఇటువంటి కారణాలన్నీ తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా సరైన నిద్ర కూడా ఉండే విధంగా చూసుకోవాలి.

దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఎప్పుడైతే సరైన నిద్ర ఉండదో రోజంతా అలసిపోయినట్లుగా భావిస్తారు మరియు కొంతమందిలో నిద్రపోయిన కొంత సమయం తర్వాత శ్వాసను సరిగా తీసుకోలేరు. దీంతో మంచి నిద్రను పొందలేరు. పైగా ఉదయం తిరిగి ఎక్కువ నిద్ర వస్తుంది. ఇటువంటి సందర్భాలలో కూడా ఎంతో అలసటను ఎదుర్కొంటారు. ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉండాలంటే తప్పకుండా విటమిన్ బి12 ఎంతో అవసరం. శరీరంలో రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి మరియు నరాల పనితీరుని మెరుగైన విధంగా జరగడానికి విటమిన్ బి12 ఎంతో అవసరం.

ఎప్పుడైతే విటమిన్ బి12 లోపం ఏర్పడుతుందో శరీరం ఎంతో అలసిపోతుంది మరియు ఎంతో బలహీనంగా కనబడతారు. ముఖ్యంగా ఏకాగ్రత కూడా తగ్గుతుంది. ఈ విధంగా మరెన్నో సమస్యలు ఎదురవుతాయి. చాలా శాతం మంది కేవలం రక్త శాతం సరిగా ఉండాలని చూస్తారు. కాకపోతే ఎర్ర రక్త కణాల్లో ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వదో దీని వలన కూడా అనారోగ్యాన్ని ఎదుర్కోవాలి మరియు దీర్ఘకాలికంగా ఎనిమియా సమస్యను కూడా ఎదుర్కొంటారు. ఈ విధంగా బలహీనంగా మారుతారు. వీటన్నిటితో పాటుగా ఇన్ఫెక్షన్లు వలన కూడా రోజంతా బలహీనంగా ఉంటారు. వైరల్ ఇన్ఫెక్షన్లు లేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వలన ఎంతో నీరసంగా ఉంటారు. కనుక ఇటువంటి లక్షణాలను ఎదుర్కొంటే తప్పకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news