రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..

-

కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ కనీస మద్దతు ధరపై కీలక నిర్ణయం తీసుకుంది. కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలియజేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం.. వరి మద్దతు ధర 72 రూపాయలు పెరిగింది. దీంతో క్వింటాల్ వరి మద్దతు ధర రూ. 1940 కి చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరపు ఖరీఫ్ పంటలకు ఇది వర్తిస్తుంది.

గత ఏడాది వరి మద్దతు ధర రూ.1868 ఉండేది. అలాగే నువ్వుల మద్దతు ధర క్వింటాలుకు 450 రూపాయలు, మినుములు క్వింటాలుకు 300 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అటు జొన్నలు తృణధాన్యాల మద్దతు ధరను కూడా కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే రైల్వేలో సిగ్నల్ ఆధునీకరణ మరియు 5 జి స్పెక్ట్రం అమలు కోసం రాబోయే 5 సంవత్సరాలలో రూ .25 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version