కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం ఉందని రెండు పార్టీలు ఒకే గూటి పక్షులని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు. బీఆర్ఎస్ చేసిన కాలేశ్వరం అవినీతిని బయట పెట్టకుండా ఆదేశించకుండా కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇవాళ ఉదయం మోడీ సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో 7200 కోట్లు రోడ్లు, రైలు, ఏవియేషన్ అభివృద్ధి పనులు వంటివి ప్రారంభించారు.
తర్వాత నిర్వహించిన బిజెపి విజయసంకల్ప సభలో ప్రసంగించారు. తెలుగు లో స్పీచ్ మొదలుపెట్టిన మోడీ తెలంగాణలో నా పర్యటన రెండవ రోజు సాగుతున్నది. ఇక్కడ ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆదరణ వృధా కానివ్వను అని అన్నారు. తెలంగాణ ని రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎన్నో నిధులను కేటాయించింది అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న దానితో పోల్చుకుంటే దళిత వెనుకబడి ఉన్న వర్గాల ప్రజల కోసం పదేళ్లలో ఎంతో చేశామని అన్నారు.