దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించేందుకు సిద్ధం అవుతుంది. అయితే చెరకు పండించే రైతులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకోబోతోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కేంద్రానికి కీలక ప్రతిపాదన చేసింది. ఇక ఇథనాల్ ధరను పెంచాలని సూచించినట్లు తెలిపారు. అయితే లీటరుకు రూ.3 మేర పెంచాలని కోరారు. ఇక ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్‌కు పంపించారని తెలిపారు.
ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు. అంతేకాదు ఇథనాల్ ధరను పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇక 2020 డిసెంబర్ 1 నుంచి ఇథనాల్ ధర పెంపు నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. ఇక ప్రస్తుతం ఇథనాల్ ధర లీటరుకు రూ.43 నుంచి రూ.59 మధ్యలో ఉందని వెల్లడించారు.
అయితే ఇథనాల్ అనేది ఒకరకమైన ఆల్కహాల్ అని అందరికి తెలిసిందే. ఇక దీన్ని పెట్రోల్‌తో కలుపుతారు. తర్వాత వెహికల్స్‌కు ఉపయోగిస్తారు. అంతేకాదు చెరకు పంట నుంచి ఇథనాల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇక భారత్‌లో చెరకు పంట ఎక్కువగా పండిస్తారని తెలిపారు. అందువల్ల దీని ఉత్పత్తి తగ్గే ఛాన్స్ లేదని పేర్కొన్నారు. అందువల్ల ఇథనాల్‌ను పునరుత్పాదక ఇంధనంగా చెప్పుకోవచ్చునని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.
అంతేకాక ఇథనాల్ ధరను పెంచడం వల్ల చెరకు రైతులకు ప్రయోజనం కలుగనుందని తెలిపారు. ఇకపోతే ఇథనాల్ ప్రొడక్షన్ డిసెంబర్ 2020 నుంచి నవంబర్ 2021 మధ్య కాలంలో రెట్టింపు అయ్యే అవకాశముందని తెలిపారు. ఇక పెట్రోల్‌కు 8 శాతం వరకు ఇథనాలు కలపొచ్చునని అన్నారు. అయితే దీన్ని 2022 నాటికి 10 శాతానికి, 2030 నాటికి 20 శాతానికి తీసుకెళ్లాలనే లక్ష్యాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.