మోడీ లైట్స్ ఆపమనడం వెనుక అర్ధం ఇదే…!

-

కరోనా వైరస్ తో ఇప్పుడు దేశం మొత్తం పోరాటం చేస్తుంది. కరోన వైరస్ ని కట్టడి చేయడానికి అన్ని విధాలుగా ప్రభుత్వాలు ప్రజలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి శుక్రవారం ఉదయం ఒక వీడియో సందేశం విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక సూచనలు చేసారు.

ఈ సందర్భంగా ఆయన ఒక పిలుపు ఇచ్చారు. ఈనెల 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటలకు మన ఇళ్లలో లైట్లు అన్నీ ఆర్పేసి.. 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు వెలిగించాలని, లేకపోతే మొబైల్ ఫ్లాష్ లైట్లు వేయాలని ప్రజలను కోరారు. దీనితో ఈ పిలుపు ఎందుకు అనేది ఎవరికి అర్ధం కాలేదు. దీని వెనుక ఉన్న అర్ధాన్ని ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ బయట పెట్టారు.

ప్రధాని మోదీ పిలుపుకి ఓ అర్థం ఉందని… యోగ వశిష్ట చాప్టర్ 6లో ద ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ కాన్షియస్‌నెస్ అని ఉంటుందన్నారు. ప్రపంచంలో 5 శాతం మంది ఎలా ఆలోచిస్తారో, 95 శాతం మంది దాన్ని అనుసరిస్తారని ఆయన అన్నారు.. అలాగే, మన శరీరంలోకి కరోనా వైరస్‌ను రానివ్వకుండా చేసే శక్తి మనలోనే ఉంటుందని అన్నారు. క్వాంటమ్ సిద్ధాంతం, రిథంభర సిద్ధాంతం ప్రకారం అందరం కలసి ఒక్కటిగా ఆలోచించి… ‘మనకు కరోనా వైరస్ సోకవద్దు’ అని,

సంకల్పం తీసుకుంటే ఆ కలెక్టివ్ కాన్షియస్‌నెస్ దాన్ని అమలు చేస్తుందని అన్నారు. మనం ఏదైతే జరగాలని బలంగా కోరుకుంటామో అది కచ్చితంగా జరుగుతుందని అన్నారు. కాబట్టి, ఒకే రోజు ఒకే సమయానికి అందరం కలసి సంకల్పం తీసుకుందామని, ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్టు పాటిద్దామని ఆయన ఈ సందర్భ౦గా ప్రజలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version