‘కోవీషీల్డ్’ కోవిడ్ 19 వ్యాక్సిన్ పై మోదీ సమీక్ష..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు కోవిడ్ 19 వ్యాక్సిన్ల ప్రయోగాలు చేపడుతోంది. అందులో ఒకటి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కోవీషీల్డ్ కాగా మరొకటి నోవావ్యాక్స్. ఐసీఎంఆర్‌తో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ రెండు వ్యాక్సిన్ల మూడో దశ ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలపై ఐసీఎంఆర్ సంతృప్తి వ్యక్తం చేసింది.

modhi

ఇక పూణేలోని సీరం ఇన్స్ టి ట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ కోవిడ్ 19 వ్యాక్సీన్ పురోగతి, తదితర విషయాలను సమీక్షించేందుకు ప్రధాని మోదీ ఈ నెల 28 న పూణేను విజిట్ చేయనున్నారు. ఉత్పాదన సహా ఇండియాలో ఈ టీకామందు పంపిణీ కోసం సీరం కంపెనీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ నెల 28న మోదీ సీరం కంపెనీని సందర్శించి, కోవిషీల్డ్ టీకామందుపై సమీక్ష నిర్వహిస్తారని పూణే డివిజినల్ కమిషనర్ సౌరవ్ రావు ధృవీకరించారు. ఇలా ఉండగా ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్ తీసుకున్న వలంటీర్లలో ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని, ఎవరూ ఆసుపత్రి పాలు కాలేదని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ టీకామందు 90 శాతం ఎఫెక్టివ్ అని తాము భావిస్తున్నట్టు ఈ సంస్థ రీసెర్చర్లు చెప్పారు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిషీల్డ్ తీసుకున్న వేలాది వలంటీర్లపై నిర్వహించిన మూడో దశ ట్రయల్స్ ఫలితాలకోసం సీరం, ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. నోవావ్యాక్స్, కోవిషీల్డ్‌ల వ్యాక్సిన్ తయారీ దీనికి భిన్నంగా ఉంది. నోవావ్యాక్స్ కోసం కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ల నుంచి హానీ చేయని పదార్థాన్ని సేకరించి… దాన్ని సూక్ష్మ కణాలుగా అభివృద్ది చేస్తారు. కోవీషీల్డ్‌ను సాధారణ జలుబు వైరస్,అడెనోవైరస్ అణువు ద్వారా అభివృద్ది చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version