వలస జీవుల కోసం తెలంగాణాలో కెసిఆర్ సర్కార్ చేసిన ఆలోచన రేషన్ పోర్టబులిటీ. అంటే ఒక జిల్లాలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా సరే వెళ్లి రేషన్ తీసుకునే సదుపాయం ఉంటుంది. దీనితో ఎక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేయలేని బడుగు జీవులకు ఈ విధానం ఎంతగానో సహకరిస్తుంది. దీనితో పేదల కడుపు నింపే ఆలోచన కెసిఆర్ చేసారు. దీనిని విజయవంతంగా తెలంగాణాలో అమలు చేస్తున్నారు.
దీనిని ఆదర్శంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నేషనల్ రేషన్ పోర్టబులిటీ తీసుకొచ్చింది. అంటే దేశంలో ఎక్కడైనా సరే రేషన్ బియ్యం ఉన్న కార్డ్ ద్వారా తీసుకునే సదుపాయం ఉంటుంది. దీని ద్వారా దేశంలో ఎక్కడైనా సరే కేజీ 3 రూపాయలకే బియ్యం పొందవచ్చు. దీనితో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్ళిన వారికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. ఈ పైలెట్ ప్రాజెక్ట్ ని ముందుగా ఏపీ, తెలంగాణలో రేషన్ పోర్టబిలిటీని ప్రారంభించారు.
ఇక్కడ హిట్ అవ్వడంతో జనవరి 1 నుంచీ కర్ణాటక, ఝార్ఖండ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, గోవా, త్రిపురలో కేంద్రం ప్రారంభించింది. రేషన్ లబ్దిదారుల డేటాను కేంద్రం ఈ-పాస్ సిస్టంకి అనుసంధానం చేయడంతో అన్ని రాష్ట్రాల్లో లబ్దిదారుల వివరాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంటోంది. దీనితో అందరికి బియ్యం లభిస్తుంది. మూడు రూపాయలకే ఎక్కడైనా బియ్యం దొరకడంతో పేదల కడుపు నిండుతుంది.