ఇమ్రాన్ ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన మోడీ.. ఎందుకంటే..?

-

అవును నిజమే.. భారత ప్రధాని నరేంద్రమోడీ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు థ్యాంక్స్ చెప్పారు. ఎందుకు అంటారా. పాకిస్తాన్‌లో సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్ పూర్ కు వెళ్లేందుకు ప్రత్యేకమైన కారిడార్ నిర్మాణానికి సహకరించినందుకు ఇమ్రాన్ ఖాన్ కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ కర్తార్ పూర్ కారిడార్ ను శనివారం ప్రారంభించారు.

ఈ కర్తార్ పూర్ కారిడార్ రెండు దేశాలకు ఆధ్యాత్మిక వారధిగా మారింది. ఈ విషయంలో పాకిస్తాన్ కూడా ఉదారంగానే వ్యవహరించింది. ఇంతకీ ఈ కర్తార్ పూర్ యాత్ర విషయం ఏంటంటారా.. సిక్కుల మత గురువైన గురునాన క్ తన చివరి 18ఏళ్ల జీవితాన్ని అక్కడే గడిపారు. అక్కడి గురుద్వారా దర్బార్ సాహిబ్ లోనే ఆయన తన శేష జీవితాన్ని గడిపారు.

అందుకే సిక్కులు ఈ ప్రాంతాన్ని పరమ పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. ఇది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న న రోవల్ జిల్లాలో ఉంది. మరో విశేషం ఏంటంటే.. ఇది భారత సరిహద్దుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొన్నిరోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇండియన్స్ కు ఆఫర్ ఇచ్చారు.

పాకిస్తాన్ లోని కర్తార్ పుర్ సందర్శనకు వెళ్లే సిక్కు యాత్రికులకు పాస్ పోర్టు మినహాయింపు ఇచ్చేశారు. అంటే కర్తార్ పుర్ సందర్శనకు పాస్ పోర్టు అవసరం లేదన్నమాట. ఇందుకు ఏదైనా గుర్తింపు పత్రాన్ని యాత్రికులు తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. యాత్రకు పదిరోజుల ముందుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

కర్తార్ పుర్ వచ్చే యాత్రికులు 20 డాలర్ల ప్రవేశ రుసుం చెల్లించాలని పాక్ గతంలో ఓ నియమం పెట్టింది. ప్రారంభోత్స వం రోజైన నవంబర్ 9న మాత్రం యాత్రికులకు ఆ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చేశారు. రోజూ ఐదు వేల మంది సిక్కులు గురుద్వార్ కు వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version