నా పేరుమీద కనీసం ఇల్లు కూడా లేదు.. కానీ.. : మోడీ

-

తన పేరు మీద ఇల్లు లేదు కానీ.. తమ ప్రభుత్వం దేశంలో లక్షలాది మంది ఆడపిల్లలను ఇంటి యజమానులను చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. చోటాఉదయ్‌పూర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గిరిజనులు అధికంగా ఉండే బోడేలి పట్టణంలో విద్యా రంగానికి సంబంధించిన రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులతో సహా రూ.5,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

పేదప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని, ఆ సమస్యలను పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజల కోసం నాలుగు కోట్ల ఇళ్లను నిర్మించినందుకు తాను సంతృప్తి చెందానన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా. పేదలకు ఇళ్లు అనేది కేవలం నంబర్ మాత్రమే కాదు.. పేదలకు ఇళ్లు కట్టించడం ద్వారా వారికి గౌరవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘‘పేదల అవసరాల మేరకు ఇళ్లు కట్టిస్తున్నాం, అది కూడా మధ్య దళారుల బెడద లేకుండా.. లక్షలాది ఇళ్లు కట్టించి మా మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాం.. నా పేరు మీద ఇల్లు లేకపోయినా తన ప్రభుత్వం లక్షల మంది కూతుళ్లను ఇంటి యజమానులను చేసింది.” అని అన్నారు.

ఇది ఇలా ఉంటె, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్న మోడీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బదులుగా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని రానున్నారు. అక్టోబర్ 1న మధ్యాహ్నం 1:30 గంలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మోడీ చేరుకోనున్నారు. 1:35 శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version