GOOD NEWS: త్వరలోనే జీతాలు పెంపు.. మంత్రి హరీష్ రావు ప్రకటన !

-

ఇవాళ హరీష్ రావు తాండూరు సభలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హరీష్ రవి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ మంచి శుభవార్తను అందించారు.. ఈయన చెప్పిన ప్రకారం అతి త్వరలోనే ఉద్యోగులు అందరి జీతాలు పెరుగుతాయని చెప్పాడు.. త్వరలో రానున్న PRC నోటిఫికేషన్ కింద అందరి జీతాలు పెరుగుతాయని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. హరీష్ రావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు అన్నీ కూడా మీకు మాయమాటలు చెప్పి రెచ్చగొడుతున్నాయని, మీరు ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదని.. కేసీఆర్ మీ అందరికీ తగిన న్యాయం చేస్తాడంటూ హరీష్ రావు అన్నారు. మీరు పోరాటాలు లేదా నిరసనలతో కేసీఆర్ ను గెలవలేరు… ప్రేమతో మాత్రమే గెలవగలరు అంటూ చెప్పారు హరీష్ రావు.

ఇంకా ఈయన మాట్లాడుతూ బీజేపీ పాలిట రాష్ట్రాలలో ఎందుకు జీతాలు పెరగడం లేదని.. త్వరలో మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు.. అప్పుడు మీరు ఈ విషయాన్ని అడగాలంటూ ఆశావర్కర్లు, అంగన్వాడీ వారిని ఉద్దేశించి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version